Tuesday, May 29, 2012

విశాఖలో విజయమ్మకు ఘన స్వాగతం

 
విశాఖలో విజయమ్మకు ఘన స్వాగతం
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మకు విశాఖ ఎయిర్‌పోర్టులో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో విమానాశ్రయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పార్టీ జెండాలు చేతబట్టి విజయమ్మను ఆహ్వానించారు.

విశాఖ నుంచి రోడ్డు మార్గంలో విజయమ్మ నర్సన్నపేట నియోజకవర్గానికి వస్తారు. నియోజకవర్గంలోని 'మడపాం' నుం...చి ప్రచారానికి ఆమె శ్రీకారం చుడతారు. కొమర్తి, మబుగాంలో నిర్వహించే రోడ్డు షోలో పాల్గొంటారు. నర్సన్నపేటలో జరిగే బహిరంగ సభలో విజయమ్మ మాట్లాడతారు..

వైఎస్ కు అంజలి ఘటించిన విజయమ్మ
విశాఖ : నర్సన్నపేట నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన విజయమ్మ విశాఖలోని ఎన్ ఏడీ జంక్షన్ లో మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె వెంట కుమార్తె షర్మిల, వాసిరెడ్డి పద్మ, కొణతాల రామకృష్ణ తదితరులు ఉన్నారు. అనంతరం విజయమ్మ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ నర్సన్నపేటకు బయల్దేరారు...........

No comments:

Post a Comment