అయ్యా, సారూ... మీ మోపిదేవి షాలా మంచోడు అని నువ్వే సర్టిఫికేట్ ఇస్తావు, మరోవైపు కేబినెట్ మీటింగులోనేమో మిగతా మంత్రులకూ ఉచ్చు తప్పదని హెచ్చరిస్తావు...!! ఇంకోవైపు సీబీఐ సరిగ్గా తవ్వితే మొత్తం 14 మంది మంత్రులకు ముప్పు తప్పదని అన్యాపదేశంగా నువ్వే సంకేతాలు ఇస్తుంటావు... మరి ఇంకా లోతుల్లోకి తవ్వొద్దని సీబీఐని అడిగిందెవరట? ఆ ఒక్క మోపిదేవి మాత్రమే మంచోడైతే మరి మిగతా మంత్రులు...??? వోకే... అందరూ మంచోళ్లైతే ...మరి సుప్రీం నోటీసులకు వ్యక్తిగత హోదాలో వివరణ ఎందుకు పంపించాలి? ఆ అన్ని జీవోలూ బిజినెస్ రూల్స్ ప్రకారమే జారీ అయ్యాయని ముఖ్యమంత్రిగా నువ్వే అఫిషియల్ వివరణ పంపొచ్చు కదా! పోనీ అలా ఇస్తే జగన్ ని ఇంకా ఇరికించడం కష్టమవుతుందని నువ్వనుకుంటే మరి ఆ ఐఏఎస్ అధికారుల ప్రాసిక్యూషన్ కి పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదు? దాన్ని డిల్లీకి పంపిస్తామంటూ కొత్త నాటకాలెందుకు?! పోనీ దీన్ని విడిచిపేడాదాం, మద్యం మాఫియా యవ్వారాలపై నువ్వే కదా ఆగమేఘాలపై దర్యాప్తు చేయించి రిపోర్ట్ కూడా తెప్పించుకున్నావు... మీ బొత్స బాబే కదా ఆ మాఫియా లీడర్... మరి ఆ కేసేం చేశావు?! చర్య తీసుకుంటే ఉచ్చ పోయిస్తానని ఏమైనా బెదిరించాడా!? ఏమోరా భయ్, నీ మాటలూ అర్థం కావు... నీ చేతలూ అర్థం కావు!!
No comments:
Post a Comment